CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:59 pm Posted by : rakeshkashaveni12@gmail.com

30వసారి రక్తదానం చేసిన లయన్ సుమన్ పటేల్

కరీంనగర్, ఆగస్టు 13 (చైతన్యగళం):
శ్రీలక్ష్మి జంతు సంరక్షణ వ్యవస్థాపకుడు లయన్ సుమన్ పటేల్ 30వసారి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గత 15 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలో పాములను సంరక్షిస్తూ, గాయపడిన వీధి కుక్కలకు సేవలందిస్తున్న ఆయన జంతు సేవతో పాటు మానవ సేవలోనూ తన వంతు కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా సుమన్ పటేల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తాను చేసిన రక్తదానం ద్వారా మరో ముగ్గురికి ప్రాణదానం చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. సుమన్ పటేల్ సేవా కార్యక్రమాలను స్థానికులు, సామాజిక కార్యకర్తలు అభినందించారు.