మేడిపల్లి ఏసీపీ కార్యాలయంలో సీపీ సుమతి ఆకస్మిక తనిఖీ

మేడ్చల్–మల్కాజ్గిరి, ఆగస్టు 13 (చైతన్యగళం): మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సీపీ సుమతి గురువారం మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ సుమతి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్తో పాటు పరిధిలోని ఇన్స్పెక్టర్లతో సమావేశమై కేసుల దర్యాప్తు, సిబ్బంది సమస్యలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణకు...