పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
కోహెడ, ఆగస్టు 13 (చైతన్యగళం): వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ అన్నారు. కోహెడ మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మేరా యువభారత్, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడలో భాగంగా గురువారం పాఠకులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారని తెలిపారు. భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత...