కొట్రలో దారుణ హత్య.. యువతిని పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చిన ప్రియుడు?

వెల్దండ, ఆగస్టు 13 (చైతన్యగళం‌): వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో యువతి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నారమళ్ల అనూష (22)ను అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చినట్లు సమాచారం. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో కొట్ర గ్రామానికి చెందిన షాంపూరి రాములు ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు మరో యువకుడు సహకరించినట్లు సమాచారం. అనూషకు, రాములుకు కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు గ్రామస్థులు...