ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
ఎల్కతుర్తి, ఆగస్టు 11 (చైతన్యగళం): హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎల్కతుర్తి మండలంలో విజయవంతం చేయాలని బీజేపీ మండల ప్రభారీ లక్కిరెడ్డి తిరుమల రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మన్విత్ హోటల్‌లో మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల రెడ్డి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం...