కల్వకుర్తి అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక ప్రతిపాదనలు మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్లపై సీఎంతో ప్రత్యేక చర్చ ఆమనగల్లు, ఆగస్టు 12 (చైతన్యగళం): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సమర్పించారు. ఆమనగల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కలిపి రూ.80 కోట్ల నిధులు మంజూరు...