తైక్వాండోలో గిన్నిస్‌ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి

ప్రపంచ రికార్డు ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఎం.డి. జాంగీర్‌.. అభినందించిన మాస్టర్లు వెల్దండ, ఆగస్టు 10 (చైతన్యగళం‌): వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎం.డి. జాంగీర్‌ తైక్వాండో క్రీడారంగంలో తన ప్రతిభను చాటుతూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. హైదరాబాద్‌లో బ్లాక్‌ బెల్ట్‌ ఫస్ట్‌ డాన్‌ సాధించిన జాంగీర్‌, హైదరాబాద్‌లో నిర్వహించిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రదర్శనలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. తైక్వాండో క్రీడారంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా జాంగీర్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించడం వెల్దండ...