కిసాన్‌నగర్ ఘర్షణ ఘటనలో ఏడుగురు అరెస్ట్
కిసాన్‌నగర్ ఘర్షణ.. ఏడుగురి అరెస్టు 29వ డివిజన్ కార్పొరేటర్ సహా నిందితులపై కేసు.. రిమాండ్‌కు తరలింపు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీసీపీ వెంకటరమణ కరీంనగర్ టౌన్, ఆగస్టు 11 (చైతన్యగళం): కిసాన్‌నగర్‌లో జరిగిన ఘర్షణ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ ఉన్నారు. ఈ మేరకు కరీంనగర్ డీసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్‌నగర్ వేపచెట్ల గ్రౌండ్ వద్ద ఈ నెల...