యూనిఫామ్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలి- కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం): జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీని డీఆర్‌డీఏ, మెప్మా, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. యూనిఫామ్‌ల పంపిణీకి ముందు వాటి నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల "అపార్" నమోదును వేగవంతం చేయాలని, ఆధార్‌లో పొరపాట్ల కారణంగా నమోదులో జాప్యం జరిగితే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సవరణలు...