సహారా డిపాజిటర్ల సొమ్ము వెంటనే చెల్లించాలి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి పెద్దపల్లి, ఆగస్టు 6 (చైతన్యగళం): సహారా ఇండియాలో పెట్టుబడులు పెట్టిన డిపాజిటర్ల కష్టార్జిత సొమ్మును వెంటనే తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు డిపాజిటర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుటుంబ అవసరాలు, వైద్యం, పిల్లల విద్య, వివాహాల కోసం దాచుకున్న పొదుపులు ఎన్నో సంవత్సరాలుగా అందక వేలాది మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఆర్సీఎస్ పోర్టల్ ద్వారా...