కమిషనరేట్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. వెంకటరమణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సి. వెంకటరమణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన...