బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంను సత్కరించిన మేయర్
కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం): కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశంను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశంను శాలువాతో ఘనంగా సత్కరించిన మేయర్, నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, సోమిరెడ్డి వేణు, భూపతి రవీందర్, తోట అనిల్, మేకల...