రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిపిఓ

జగిత్యాల, ఆగస్టు 6 (చైతన్యగళం): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (జిపిఓ) మాథే రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఫిర్యాదుదారుడి పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో దాడి నిర్వహించి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్న...