రేణ్యాతండాలో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
200 ఇళ్ల తనిఖీలు.. గుడుంబా స్వాధీనం.. అవగాహన కల్పించిన పోలీసులు మహబూబాబాద్, ఆగస్టు 6 (చైతన్యగళం): జిల్లా పోలీసు అధికారి డా. శబరీష్ ఆదేశాల మేరకు కొత్తగూడ మండలం రేణ్యాతండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. కొత్తగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 ఇళ్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే 32 లీటర్ల గుడుంబా,...