ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

హైదరాబాద్, ఆగస్టు 6 (చైతన్య గళం): తెలంగాణ ప్రభుత్వం కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో...