హుస్నాబాద్, ఆగస్టు 5 (చైతన్యగళం):
చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో సర్పంచ్ గుళ్ల రజిత రాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పనులు, ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, 2026 గ్రామ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని అభివృద్ధి పనులపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.