పంచాయతీ భవనాల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం): మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, నిర్మాణ దశలో ఉన్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మరణించిన మల్టీపర్పస్ కార్మికుల కుటుంబాలకు అందాల్సిన...