తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

హుస్నాబాద్, ఆగస్టు 5 (చైతన్యగళం): హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి, ఐదవ వార్డుల్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ, ప్రతి తల్లి శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించి, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పోషకాహారం, శిశు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు....