సిద్దిపేట జనరల్ ఆసుపత్రికి రూ.5.49 కోట్ల వైద్య పరికరాలకు ఆమోదం
సిద్దిపేట, ఆగస్టు 6 (చైతన్యగళం): సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రూ.5.49 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వివరాలు సమగ్రంగా అందించడంలో విఫలమైన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత...