కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్య గళం):
కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయి మల్లేశం నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.