ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచాలి – కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట, ఆగస్టు 5 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ, సమయపాలనతో నాణ్యమైన విద్యాబోధన అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవనంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బోధన నాణ్యతపై రాజీ పడొద్దని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు, పాఠ్యాంశాల బోధన, మధ్యాహ్న భోజనం...