మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి
హైదరాబాద్, ఆగస్టు 4 (చైతన్య గళం): ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజావాణి' కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య–4, తేదీ: 04-08-2026 ను జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించగా, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, ప్రాథమిక ఆరోగ్య...