ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి

కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్య గళం): జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం–2010 కింద ఏర్పాటు చేసిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వివిధ శాఖల నుంచి రావాల్సిన నిరభ్యంతర ధ్రువపత్రాల (ఎన్‌వోసీ) స్థితిపై కలెక్టర్ సమీక్షించారు. పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో...