CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 7:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పేదలకు పెద్దన్నగా గోలి శ్రీనివాస్ రెడ్డి.. రూ.10 వేల ఆర్థిక సాయం

  • మృతుడి కుటుంబానికి పరామర్శ
  •  ⁠గాయపడిన వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం చేయూత

ఆమనగల్లు, ఆగస్టు 5 ( చైతన్యగళం):
పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వెల్దండ మండలం చేర్కూర్ గ్రామపంచాయతీలో రెండు కుటుంబాలకు కలిపి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటారు. ఇటీవల మరణించిన చేర్క వెంకటయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ద్వారా సమాచారం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వారికి తక్షణ సాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన వంగూరి లక్ష్మయ్య ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి, ఆయనను స్వయంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం మరో రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు గోలి శ్రీనివాస్ రెడ్డి సేవాభావాన్ని అభినందిస్తూ, కష్టకాలంలో ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, మైసయ్య, మాజీ ఎంపీటీసీ భీమయ్య, ఉప సర్పంచ్ కొండల్, నర్సింహా, నాయకులు తారాసింగ్, మెండే శ్రీను, వార్డు సభ్యులు లాలయ్య, రమేష్, అల్లే సందీప్, సాయి, శ్రీరాములు, బాలయ్య, గడ్డం శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.