జలసిరి, స్వచ్ఛత కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష
సిద్దిపేట, ఆగస్టు 5 (చైతన్య గళం): భూగర్భ జలాల మట్టం తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు జలసిరి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. ఫార్మ్ పాండ్‌లు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేసి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జలసిరి, శానిటేషన్ డ్రైడే,...