గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
దుబ్బాక, ఆగస్టు 5 (చైతన్యగళం): సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం దుబ్బాకలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం, వంటశాల, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. బిర్యానీ రైస్ నాణ్యత సరిగా లేదని గుర్తించి, అవసరమైన పదార్థాలను సమపాళ్లలో ఉపయోగించి రుచికరంగా వండి విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్‌ను...