ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం
ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడు యశ్‌పాల్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రదీప్ రావత్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. హిందీ చిత్రాలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2004లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'సై' చిత్రంలో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనకు విశేష ఆదరణ...