CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 3:17 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బట్లపల్లి గ్రామంలో భూ రీ సర్వే పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్

మర్రిగూడ, ఆగస్టు 4 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలోని బట్లపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు చండూరు ఆర్డీవో శ్రీదేవి కూడా పాల్గొన్నారు.

తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, సర్వేయర్ స్వప్న నుంచి భూ సర్వే వివరాలను తెలుసుకున్న కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించి భూముల హద్దులు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్, మర్రిగూడ మండల ఎంపీడీవో మున్నయ్య, పలువురు అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. గ్రామంలో భూ రీ సర్వే పనులు సజావుగా కొనసాగుతున్నాయి.