CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:25 am Posted by : CHAITHANYA GALAM NEWS

భారత మానవ హక్కుల పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా తక్దీర్ అలీ

పెద్దపల్లి,ఆగష్టు 03(చైతన్యగళం):
దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా సేవనందిస్తున్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అఫ్ ఇండియా ట్రస్ట్ (ఎన్జీవో) తన నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా,సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ మొహ్మద్ తక్దీర్ అలీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో నేషనల్ చైర్మన్, వ్యవస్థాపకులుగా మొహ్మద్ తక్దీర్ అలీ,నేషనల్ వర్కింగ్ చైర్మన్ గా మ్యాకల పర్శరాములు నేషనల్ జనరల్ సెక్రటరీగా సనా,నేషనల్ జాయింట్ సెక్రెటరీగా అశ్రఫ్ సుల్తానా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మేడిపల్లి సాయి రమ్య శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జస్టిస్- ఈక్వలిటీ-హ్యుమానిటీ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ,రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం,జిల్లా,మండలం,గ్రామ స్థాయిలోనూ కమిటీలను విస్తరిస్తూ,ప్రజాక్షేత్రంలో మానవ హక్కులపై అవగాహన కల్పించడం,ఉచిత న్యాయ సహాయం అందించడం,మహిళలు-చిన్నారులు-అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడటం మరియు విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం వంటి సేవలను మరింత ఉత్సాహంగా కొనసాగించనున్నట్లు నూతన జాతీయ కమిటీ స్పష్టం చేసింది.