ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ తప్పనిసరి – మంత్రి శ్రీధర్ బాబు

సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు స్వస్తి టీ-స్వాన్‌ను నెల రోజుల్లో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్(చైతన్యగళం): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల...