వరంగల్, హనుమకొండ బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి
వరంగల్, ఆగస్టు 4 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మంగళవారం వరంగల్, హనుమకొండ ప్రధాన బస్టాండ్లు, హనుమకొండ డిపోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, డిపో నిర్వహణ, మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వరంగల్ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ- బస్ సేవా పథకం కింద మరో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి...