డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన

పెద్దపల్లి, ఆగస్టు 4(చైతన్యగళం): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యువత గంజాయి, డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య,...