ఫ్యాబ్రిక్ డై, సింథటిక్ కలర్స్‌తో మసాలాల తయారీ: సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశామని భాగ్యనగర సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు 4 (చైతన్యగళం): హైదరాబాద్‌లో కల్తీ మసాలాల (Adulterated Masalas) తయారీ కేంద్రాలపై H-FAST ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశామని భాగ్యనగర సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పేర్కొన్నారు. 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల సమాచారం ఆధారంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పుకొచ్చారు. 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు....