విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి పోలీసుల మానవతా చేయూత

కరీంనగర్, ఆగస్టు 4{చైతన్యగళం}: హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కార్పెంటర్ రాజ్‌కుమార్ విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. మూడు నెలల క్రితం గన్ముకుల గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ పనులు చేస్తుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కుటుంబ పరిస్థితిని గుర్తించిన వీణవంక రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్‌ఐ ఆవుల తిరుపతి...