మర్రిగూడ, ఆగస్టు 4 (చైతన్యగళం):
మర్రిగూడ మండల కేంద్రంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వీబీజీ రాంజీ సిబ్బంది నాలుగో రోజు కూడా పెన్‌డౌన్–షట్‌డౌన్ చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నరసింహ, సీఈవో నాగభూషణ్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బంది మాట్లాడుతూ, “ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది” అని హెచ్చరించారు. మండల కేంద్రం నిరసన వాతావరణంతో మారుమ్రోగింది.