బోనాల ఉత్సవాలను విజయవంతం చేసినందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు ముదిరాజ్ సంఘాల ఘన సన్మానం

కరీంనగర్ టౌన్ , ఆగస్టు 03(చైతన్యగళం): నగరంలోని 14 ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు బోనాల పండుగ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మేయర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి తమ అభినందనలు తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు నగరపాలక సంస్థ అన్ని విధాలుగా సహకరించడం వల్లే ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగాయని వారు పేర్కొన్నారు.మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ,...