ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలి సీపీఎం
జమ్మికుంట, ఆగస్టు 4{చైతన్యగళం}: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను టౌన్ కార్యదర్శి దండి సతీష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు తగిన మెయింటెనెన్స్ నిధులు కేటాయించాలని, జమ్మికుంట బాయ్స్ హైస్కూల్‌కు ఆడిటోరియం, కొత్త భవనాలు,...