బుట్టిరాజారాం కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్.. 62 వాహనాలు స్వాధీనం
కరీంనగర్, ఆగస్టు 4(చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఐపీఎస్ ఆదేశాల మేరకు కరీంనగర్-III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్‌తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్-III టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. తిరుమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, II టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పుల్లయ్య, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్,...