హైదరాబాద్‌ వెళ్లకుండా విశ్రాంత ఉద్యోగుల నేతల అరెస్ట్

వనపర్తి ,ఆగష్టు 04(చైతన్యగళం): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాలనీ సర్కిల్ వద్ద వారిని వనపర్తి పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్‌కు తరలించిన వారిలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ నాయకులు రామచంద్రరెడ్డి, సత్యనారాయణ...