తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం కార్యదర్శిగా నీలా రవీందర్
హైదరాబాద్, ఆగస్టు 2 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా షాద్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు నీలా రవీందర్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.రాష్ట్ర స్థాయి పదవిని అలంకరించేందుకు అవకాశం కల్పించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గందే సురేష్ కి నీలా రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఆయన వివిధ సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు....