CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం కార్యదర్శిగా నీలా రవీందర్

హైదరాబాద్, ఆగస్టు 2 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా షాద్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు నీలా రవీందర్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.రాష్ట్ర స్థాయి పదవిని అలంకరించేందుకు అవకాశం కల్పించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గందే సురేష్ కి నీలా రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత దశాబ్ద కాలంగా ఆయన వివిధ సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2010లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టి సంఘ బలోపేతానికి కృషి చేశారు. 2017లో షాద్నగర్ వాసవి క్లబ్‌లో, 2024లో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారిగా పనిచేసి ఆర్థిక నిర్వహణ, సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం తాజాగా ఆయనకు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.రాష్ట్ర కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన నీలా రవీందర్‌ను పలువురు రాజకీయ, సామాజిక, కుల సంఘాల ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ నియామకం ద్వారా షాద్నగర్ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో మరోసారి ప్రాతినిధ్యం దక్కడం పట్ల స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.