బాంకీపూర్‌లో పీకే సంచలనం.. బీజేపీ కంచుకోట బద్దలు!

తొలి ఎన్నికలోనే ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. కమలదళానికి గట్టి ఎదురుదెబ్బ.. బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర పాట్నా(చైతన్యగళం): బీహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా బీజేపీకి అజేయ కోటగా భావించిన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) తన తొలి ఎన్నికలోనే సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ ఫలితంతో బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి...