కళాకారులకు పెద్దన్న… పేదలకు భరోసా – ఈగ మల్లేశం

హనుమకొండ, ఆగస్టు 2 (చైతన్యగళం): కళాకారుల సంక్షేమం, నిరుపేదలకు చేయూత, విద్యార్థులకు విద్యాసహాయం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందిన ఈగ మల్లేశం గారు ఘన సత్కారం అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల ఎస్. జానకి మధురస్మృతులను స్మరించుకుంటూ నిర్వహించిన “స్వరాభిషేకం” మహోత్సవ వేదికగా ఈ సన్మానం జరిగింది.ఈ సందర్భంగా ఈగ మల్లేశం–సంగీత దంపతులకు గజమాలతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని అందజేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్న ఆయన సేవా ప్రస్థానాన్ని నిర్వాహకులు కొనియాడారు. రాజకీయ, సామాజిక,...