ఆకుతోటపల్లి క్వారీలపై మళ్లీ రగిలిన నిరసన
అదనపు కలెక్టర్‌కు మరోసారి వినతి.. సమగ్ర విచారణ జరిపి అనుమతులు రద్దు చేయాలని గ్రామస్థుల డిమాండ్ ఆమనగల్లు, ఆగస్టు 3 (చైతన్యగళం): ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 302, 304లో ప్రతిపాదిత క్వారీలు, స్టోన్ క్రషర్ల ఏర్పాటుపై గ్రామస్థుల నిరసన మరింత ఉధృతమైంది. గ్రామ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతుల ప్రక్రియ కొనసాగుతుందంటూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి కు మరోసారి కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్వారీలు, స్టోన్...