జీవితానికి వెలుగు నింపే బంధం… స్నేహం
"రక్త సంబంధం లేకపోయినా హృదయాలను కలిపే పవిత్రమైన అనుబంధమే స్నేహం." మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత విలువైన బంధం స్నేహం. సుఖంలో ఆనందాన్ని పంచుకుంటూ, కష్టాల్లో అండగా నిలబడి, ఆపదలో చేయూతనిచ్చే వ్యక్తే నిజమైన స్నేహితుడు. అందుకే స్నేహం కాలం గడిచే కొద్దీ మరింత బలపడే అపురూపమైన బంధంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం ఆగస్టు నెల తొలి ఆదివారం స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తారు. చిన్ననాటి నుంచి ఏర్పడిన స్నేహాలు జీవితాంతం మధుర...