వందేమాతరం స్ఫూర్తిని ప్రతి గడపకు చేర్చాలి – బండి సంజయ్

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం): ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వందేమాతరం పూర్తి గీతం పోస్టర్లు, ప్యాకెట్ కార్డులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వాతంత్ర్య సంగ్రామంలో అసేతు హిమాచలాన్ని ఏకం చేసిన మహామంత్రం వందేమాతరం. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జారిన ఈ అక్షరాగ్ని శిఖ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో వందేమాతరం ఒక తారక మంత్రంలా ప్రజలను ఏకం చేసింది. కులమతాలకతీతంగా భారతీయులను స్వాతంత్ర్య...