ర్యాగింగ్‌పై కఠిన చర్యలు అమల్లో ఉన్నాయి – సివిల్ జడ్జి అపర్ణ మల్లాది
మంథని, ఆగస్టు 1 (చైతన్యగళం): జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ, “ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు, అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. తోటి విద్యార్థులపై కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన శిక్షలు తప్పవు” అని హెచ్చరించారు. ర్యాగింగ్ అనైతిక చర్య, అమానవీయమని ఆమె పేర్కొంటూ, “భారతీయ...