ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
హుజూరాబాద్, జూలై 31(చైతన్యగళం): ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.శుక్రవారం రాత్రి హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, కార్యాలయ పనితీరును పరిశీలించి ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్ నరేందర్‌తో సమావేశమై ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిని పరిశీలించిన ఆమె, ఇంటింటి సర్వే, ఓటరు జాబితా సవరణ, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా,...