ఆగస్టు 10 వరకు ఎస్‌ఐఆర్ గడువు.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట, ఆగస్టు 1 (చైతన్యగళం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినందున జిల్లాలోని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల...