పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ..!
నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 188 గజాల భూమి కబ్జాకు యత్నం బాధ్యుడిపై చర్యలు కోరుతూ కార్యదర్శి ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు మర్రిగూడ, ఆగస్టు 1 (చైతన్యగళం): ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుదాబాక్షపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వెలుగుచూసింది. నకిలీ ఇంటి పన్ను ధ్రువీకరణ పత్రాలను సృష్టించి 188 గజాల స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నించినట్లు ఆరోపణలు రావడంతో విషయం పోలీసుల దృష్టికి...